{"product_id":"anveshana-by-manjari","title":"Anveshana By [Manjari]","description":"\u003cp\u003eఅది సిటీకి నలభై కిలోమీటర్ల దూరంలోని సముద్రతీర గ్రామం. ఆ గ్రామంలో మత్స్యకారులు అధికం. విశాఖ స్టీలుప్లాంటుకి స్థలాలు ఇచ్చిన కుటుంబాల్లో కొంతమంది సంపాదించుకున్నా అధిక శాతం చేపలవేట - వృత్తిగా జీవిస్తారు. సిటీ నుంచి ఓ సబర్బన్ బస్సు ఆ గ్రామానికి వస్తుంది. అక్కడ విరివిగా లభించే సముద్ర ఉత్పత్తులు ఆ బస్సు ద్వారానే సిటీలోని మార్కెట్లోకి చేరతాయి. బస్సు వెళ్ళని చోట్లకి ఆటోలు ఉండనే ఉన్నాయి.\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఒక ప్రైవేటు హాస్పిటల్ ఆ గ్రామంలో వుంది. రెండు పడకలు మాత్రమే గల ఆ హాస్పిటల్లో ఒక బెడ్ మీద డెబ్బయి ఏళ్ళ వృద్ధురాలు మరణానికి అత్యంత సమీపంగా వున్నట్టు ఎగశ్వాస తీస్తోంది. కొద్దిమంది బంధువులు బెడ్ పక్కన వున్నారు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఇంటికి తీసుకుపొమ్మని అంతకు ముందే డాక్టర్ చెప్పి వెళ్ళాడు. మరణం అనివార్యమైనప్పుడు అక్కడ నుంచి కదపడం దేనికని బంధువులు అనుకుంటే. పేషెంట్ బతకదని నిర్ధారణ అయ్యాక అక్కడ ఉంచడం దేనికని డాక్టర్ అనుకున్నాడు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఅలాంటి స్థితిలో ముసలమ్మ నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. బంధువులు అతృతగా కాస్త ముందుకి జరిగారు. ముసలమ్మ అందర్నీ పరకాయించి చూసి ఒకతని మీద దృష్టి నిలిపి దగ్గరకు రమ్మన్నట్టు తలూపింది. ఆ యువకుడు వచ్చాక బలహీనమైన స్వరంతో చెప్పింది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\"భరణిబాబుని పిలుచుకు రారా...”\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఆ యువకుడు అయోమయంగా చూసాడు\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":44497907056705,"sku":null,"price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20260830_073634042_jpg.jpg?v=1788105442","url":"https:\/\/chaayavennela.in\/products\/anveshana-by-manjari","provider":"chaayavennela","version":"1.0","type":"link"}