Jayamma Panchayati by [Manku SaiBharath]
ప్రతీ సినిమా పూర్తి చెయ్యడం విజయమే. ఆ విజయం వెనుక ఎంతో కష్టం, ఎంతో మంది శ్రమ ఉంటుంది అని వేరేగా చెప్పక్కర్లేదు. అలానే ఈ జయమ్మ పంచాయితీ కూడా ఒక విజయవంతమైన ప్రయత్నం. శ్రీకాకుళ ప్రాంత కళాకారుల ప్రతిభబయట కు తీసుకు రావడానికి జరిగిన గొప్ప ప్రయోగం. యే యే సినిమా లకు యా యా సినిమా కు మాత్రమే ఉండే కష్టాలు ఉంటాయి. అవి ఆ సినిమా కి అందులో భాగం పంచుకున్న అందరికీ ప్రత్యేకం. అలాగే ఈ జయమ్మ పంచాయితీ పుస్తకం, ఈ సినిమా లో పని చేసిన వివిధ నటీనటుల, సాంకేతిక నిపుణుల అనుభవ, అభిప్రాయ సమాహారం. ఇందులో వారు వారి వారి అనుభవాలు మనతో పంచుకున్నారు. తెర మీది పాత్రలతో సినిమా చూస్తూ మాట్లాడేసారు. ఆ పాత్రలు పోషించిన వారితో మాట్లాడాలి అంటే ఈ పుస్తకం కొంత వరకు దోహద పడుతుంది. పుస్తకం కోసం రాయడం కాకుండా, వారి వారి స్వంత యాస భాషలలో రాశారు ఇందులో. చదువుతున్నంతసేపూ వారి వ్యక్తిత్వం, అమాయకత్వం, సినిమా మీద ప్రేమ కనిపిస్తుంటాయి. -సాయి భరత్ మంకు