{"product_id":"mrutyu-keratam-by-manjari","title":"Mrutyu Keratam By [Manjari]","description":"\u003cp\u003e\u003cspan\u003eచల్లటి గాలితెర విసురుగా వీచింది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eసాయంకాలం ఐదు గంటలు అయింది సమయం. ఉదయం నుండి తన ప్రతాపం చూపిన సూర్యుడు అస్తమించటానికి ఆయత్తమవుతున్నాడు. వాతావరణంలో మార్పువచ్చి చల్లబడింది.\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనెమ్మదిగా కళ్ళు తెరిచాడు చంద్రం. అప్పటివరకూ ఫుట్పాత్ మీద పడుకునివున్నాడు. అతనికి పది సంవత్సరాల వయస్సు వుంటుంది. నిక్కరు, షర్టు అతని దుస్తులు. జుట్టు చెదరి దుమ్ముకొట్టుకుపోయింది. మురికిపట్టి శరీరం అసహ్యంగా కనిపిస్తోంది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఊహ తెలిసిన దగ్గిర నుండి వెంటవున్న తల్లి యిప్పుడు లేదు. నాలుగు రోజుల నుండి తిండి లేదు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eతల్లి శవాన్ని మున్సిపాల్టీవాళ్ళు, గుడిసెలోని సామాను చుట్టుప్రక్కలవాళ్ళు తీసుకుపోయారు. ఇప్పుడు ప్రపంచంలో అతనికి ఎవరూ లేరు. పది రోజుల క్రితం సాఫీగా సాగిపోతున్న జీవితం ఒక్కసారి తారుమారయింది. ప్రస్తుతం అతను ఒక నిర్భాగ్యుడు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఆకలితో కడుపు కాలిపోతోంది. ఆకలి వేసినప్పుడు అమ్మను అడిగి తినటం మాత్రమే తెలుసు. ఇప్పుడు తన ఆకలి తనే తీర్చుకోవాలనే విషయం ఆ కుర్రాడికి స్పష్టంగానే బోధపడింది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eనెమ్మదిగా లేచి కూర్చున్నాడు. ముందు కడుపులోకి ఏదో ఆహారం కావాలనేది నిజం. గత ఆరు గంటల నుండి పడివున్న ప్రదేశాన్ని వదిలిపెట్టి నడవసాగేడు. దారిలో ఒకచోట కుళాయి కనిపించింది. కడుపునిండా నీళ్ళు త్రాగాడు\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":44497911152705,"sku":null,"price":120.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20260830_073859601_jpg.jpg?v=1788105651","url":"https:\/\/chaayavennela.in\/products\/mrutyu-keratam-by-manjari","provider":"chaayavennela","version":"1.0","type":"link"}