Skip to product information
Nanigadu  by [ V Mallikarjun ]
1/2
Nanigadu by [ V Mallikarjun ]
Rs. 150.00

NANIGADU
Conversations with my nephew
by V. Mallikarjun

కొన్ని కొన్నింటిని దాచిపెట్టుకోవడంలో ఏదో తెలియని ఆనందం దాగుంటుందనిపిస్తుంది. నా చిన్నప్పుడు మా ఇంటికి ఏ పెళ్లిపత్రిక వచ్చినా దాన్ని తీసుకెళ్లి ఒక చిన్న సీకుకి గుచ్చిపెట్టేది మా అమ్మ. ఎప్పుడైనా తీసి చూస్తే ఎవరెవరివో ఎప్పటెప్పటివో పత్రికలు కనిపించేవి. ఇవ్వాళ వాటికి నా జీవితంలో ఏ రకమైన విశేషమూ లేకపోయినా, అవి అలా ఉండేవని గుర్తుతెచ్చుకోవడం బాగుంటుంది. ఈ పుస్తకం అలాంటిదని చెప్తాను. ఏమున్నాయి ఈ పుస్తకంలో? ఇవి కథలు కాదు. మ్యూజింగ్స్ అని కూడా చెప్పలేను. మా నానిగాడితో చెప్పుకున్న కబుర్లు, జరిపిన సంభాషణలు. అన్నీ మన రోజూవారీ మాటల్లాగే మొదలై అలాగే ముగిసేవి. మొత్తం ఇరవై ఐదు సంభాషణలు.
మనందరిలో ఎప్పటికీ ఉండే బాల్యానికి గుర్తుగా మా నానిగాడి పుస్తకం.
-వి. మల్లికార్జున్

You may also like