{"product_id":"oka-prema-katha-oka-pelli-katha-by-potturi-vijayalakshmi","title":"Oka Prema Katha, Oka Pelli Katha By [Potturi Vijayalakshmi]","description":"\u003cp\u003e\u003cstrong\u003eఒక ప్రేమకథ! ఒక పెళ్ళి కథ!!\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఫోం పరుపుమీద పడుకుని వెచ్చగా బ్లాంకెట్ కప్పుకుని గాఢనిద్రలో ఉన్న కల్యాణ్ ఫోన్ మోతకి నిద్రలేచాడు. బద్దకంగా లేచి వెళ్ళి ఫోన్ అందుకుని 'హల్లో' అన్నాడు మత్తుగా.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\"హలో కల్యాణ్ హేపీ న్యూ ఇయర్\" అంది ఓ కోమల కంఠం.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eతెల్లబోయాడు కల్యాణ్ ఎవరా అనుకుంటూ, \"థాంక్యూ, బైదిబై ఎవరు \u003c\/span\u003e\u003cspan\u003eమీరు?\"అన్నాడు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eదీర్ఘమైన నిట్టూర్పు! \"ఎవరని చెప్పను డార్లింగ్? నీ అభిమానిని. నిన్ను అనుక్షణం ఆరాధించే అభిమానిని. నీ కడగంటి చూపు కోసం పడిగాపులు పడే నిర్భాగ్యురాలిని.” దీనంగా ధ్వనించింది ఆ కోమల కంఠం.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఆశ్చర్యపోయాడు కల్యాణ్. \"మీరూ? రాంగనంబర్ కి ఫోన్ చేశారేమో?” \u003c\/span\u003e\u003cspan\u003eఅనుమానంగా అడిగాడు.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eకిలకిల నవ్వింది ఆ అమ్మాయి. \"కాదు అసలయిన వారికే ఫోన్ చేశాను. ఏం నమ్మకంగా లేదా? నేను నిజంగా మీ అభిమానిని.”\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\"నిజం?\" నమ్మశక్యం కానట్లు అడిగాడు కల్యాణ్.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\"నిజం. అయినా అంత ఆశ్చర్యం ఎందుకో? మంచి టెన్నిస్ ప్లేయరు. మంచి గాయకులు, బాంక్ ఆఫీసరు, ఆస్థిపరులు. అన్నిటినీ మించి అందమైనవారు అయిన మీకు నాలాంటి అభిమాని ఉండకూడదా? \"చిలిపిగా \u003c\/span\u003e\u003cspan\u003eఅడిగింది.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eహఠాత్తుగా భలే సరదా వేసింది కల్యాణికి. జీవితంలో ఏదో కొత్త అనుభవం. ఇన్నాళ్ళూ ఫ్యాన్స్ లేరు. గొప్పవాళ్ళందరికీ బోలెడంతమంది \u003c\/span\u003e\u003cspan\u003eఅభిమానులుంటారు. అసలు అభిమాని అంటే ఎలా ఉంటుందో? \u003cbr\u003e\u003cbr\u003e\u003c\/span\u003e\u003cspan\u003e\"ఏమిటీ మాట్లాడరేం నిద్రపోతున్నారా?” కొంటెగా అడిగింది ఆ అమ్మాయి.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003eఅదిరిపడ్డాడు కల్యాణ్.\u003c\/span\u003e\u003c\/p\u003e\n\u003cp\u003e\u003cspan\u003e\"అబ్బే అదేంలేదు. ఊరికే ఏదో ఆలోచనలో మునిగిపోయాను\" అన్నాడు\u003c\/span\u003e\u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":44497929666625,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20260830_073554202_jpg.jpg?v=1788106294","url":"https:\/\/chaayavennela.in\/products\/oka-prema-katha-oka-pelli-katha-by-potturi-vijayalakshmi","provider":"chaayavennela","version":"1.0","type":"link"}