{"product_id":"swargaaniki-daari-by-b-kalpana","title":"Swargaaniki Daari by [B.Kalpana]","description":"\u003cp\u003eపెళ్లి చేయడంతోనే బాధ్యత తీరిపోయిందని ,ఏవైనా కష్టనష్టాలు వచ్చినా ఎలాగో సర్దుకుని బ్రతకాలని అన్నింటికీ రాజీ పడటమే జీవితం అని ఆలోచించే తల్లిదండ్రులు ఉన్నంతకాలం ఆడపిల్ల ఎప్పుడు ఆడపిల్లే అవుతుంది ఈడ పిల్ల ఎప్పటికీ కాదు. పుట్టినప్పటి నుండి పెరిగి పెద్దఅయ్యే వరకు తల్లిదండ్రుల మాటలు పెళ్లి చేసుకున్నాక భర్త మాటలు విని ఆచరించడమే ఆడపిల్ల జీవితం కాదు ! ఆడపిల్లకు కూడా మనసు ఉంటుంది . ఇష్ట అయిష్టాలు ఉంటాయి. కలలు కోరికలు ఉంటాయి. తను కోరుకున్న వాడిని పెళ్లి చేసుకునే హక్కు ఉంటుంది. ఎంతమంది తల్లిదండ్రులు తమ కన్న కూతురు ఇష్టాన్ని తెలుసుకొని పెళ్లి చేస్తున్నారు ? రామాయణాన్ని, సీతారాములని ఆదర్శంగా తీసుకునే మన సమాజం సీతా స్వయంవరాన్ని ఎందుకు ఆదర్శంగా తీసుకోదు ? జనకమహారాజు తన కూతురు ఇష్టాన్ని తెలుసుకుని కూతురు ఎంచుకున్న వాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. పురాణాల్లో అయినా రాజరికం నాటి రాణులైన స్వయంవరంలో తాము కోరుకున్న వాడిని ఎంచుకొని పెళ్లి చేసుకున్నారు. నాగరికత అభివృద్ధి చెందే కొద్దీ స్త్రీకి ఒరిగిందేమిటి ? ఇందులోని ఆడపిల్ల మీ ఇంట్లో కూడా అక్క చెల్లెలి రూపంలోనో, తల్లి రూపంలోనో ,భార్య రూపంలోనో ఉండే ఉంటుంది ! ప్రతి ఆడపిల్ల ఈ కథలోని ఏదో ఒక సందర్భాన్ని ఎదుర్కొనే ఉంటుందంటే అతిశయోక్తి కాదు ! ఆడపిల్ల మనసును మీ ముందు వ్యక్తపరిచే ప్రయత్నమే ఈ స్వర్గానికి దారి !\u003c\/p\u003e","brand":"chaayavennela","offers":[{"title":"Default Title","offer_id":48936107638849,"sku":null,"price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0682\/5338\/4769\/files\/InShot_20260921_132845164_jpg.jpg?v=1789978095","url":"https:\/\/chaayavennela.in\/products\/swargaaniki-daari-by-b-kalpana","provider":"chaayavennela","version":"1.0","type":"link"}