Aame Kadali Athanu Varsham by [Sampreeth Shivaiah Neeli]
వాన చినుకుది ఎప్పుడూ పరుగులాటే... సముద్రానిది ఎప్పుడూ ఎదురుచూపే! తెలుగు సాహిత్యంలో తొలిసారిగా — ఒక ఫ్లిప్ నవల (Two-Sided Flip Novel). రెండు వైపులతో కూడిన ఈ లిటరరీ టేప్ రికార్డర్ ఫార్మాట్లో, మీరు ఎటువైపు నుంచైనా చదవడం మొదలుపెట్టొచ్చు. దారులు వెతుక్కునే వర్షం, అన్నీ దాచుకునే కడలిని కలిస్తే ఏమవుతుంది? కడలికి ఫొటోగ్రఫీ తన భయాల్ని, గతాన్ని అర్థం చేసుకునే భాష. తండ్రితో ఆమెకున్న లోతైన బంధం ఆమె జీవితాన్ని నిర్వచిస్తుంది. వరుణ్‌కి మాత్రం మాటల కంటే మౌనంలోనే ఎక్కువ అర్థం కనిపిస్తుంది. "ఆమె కడలి అతను వర్షం" కేవలం ప్రేమకథ కాదు — తండ్రీకూతుళ్ల అనుబంధం, స్నేహం, మనిషిలో ఉన్న భయాలు, మానవ సంబంధాల లోతుల్ని స్పృశించే ఎమోషనల్ డ్రామా. కొందరు మనుషులు మన జీవితంలోకి వచ్చేది మన కథను మార్చడానికి కాదు..మనల్ని మనం చూసుకునే విధానాన్ని మార్చడానికి. ఈ పుస్తకం వీరికి ప్రత్యేకం: