Skip to product information
Panditha Parameswara Sastry Veelunaama By [Gopi Chand]
Panditha Parameswara Sastry Veelunaama By [Gopi Chand]
Rs. 200.00

కొన్ని రచనలు చదివితే ప్రపంచాన్ని ప్రశ్నిస్తాం. కొన్ని రచనలు చదివితే, మనల్ని ప్రశ్నించుకుని ప్రపంచాన్ని సమాధానంకోసం అడుగుతాం. కొన్ని రచనలు చదివితే చైతన్యంలో నిషిద్ధమైనదేదో. నిర్వేదమైనదేదో తెలుసుకుంటాం మనోవీధిలో మరో మలుపుకొస్తాం.
అలాటి మలువు తిరిగినా మార్గాలు కలిసేచోట. నా మార్గం పోగొట్టుకున్నట్టవుతుంటుంది. ఐతే ఈ జీవనవీధిన లౌక్యంతో రచ్చగెలిచి, అలౌక్యంలోకి మిగలడమా? అలౌక్యంలో లౌక్యం కలుపుకుని నెట్టుకు రావడమా? అదలా ఉంచితే మనం ఏం చెప్పాం? ఏం యోచించాం? ఏం చేశామనేది కాదు... "ఆఖరికి ఏమయ్యాం" అనేది ముఖ్యం. అదిగో అక్కడో పేచీ
మానసిక మహా పరిణామంలో హార్మోనియన్ గా, ఆనందవర్ణ సమ్మేళనంతో "దివ్యచైతన్యం లో మనిషి మనుగడ" ఊహ జీవితం కాదు -పచ్చి నిజం అనే శ్రీ అరవిందమహార్ణవంలో చిన్న అలవరకు వివిధ స్థాయిలను స్పృశించిన మనిషి రూపమే ఈ 'వీలునామా'.

You may also like