Skip to product information
Upma Batch by [Medarametla Chakradhar Naidu]
1/2
Upma Batch by [Medarametla Chakradhar Naidu]
Rs. 249.00

ఈ పుస్తకంలో ఉన్న కథలలో చాలా వరకు కల్పితం కాదు.
అవి నా జీవితంలో నిజంగా జరిగిన సంఘటనలు.
అప్పుడు నేను ఇబ్బంది పడ్డ క్షణాలు,
ఇప్పుడు గుర్తుకొస్తే నవ్వొచ్చే జ్ఞాపకాలు.
జీవితం నాకు ముందుగా ప్రశ్న వేసింది.
తర్వాత దానికి సమాధానంగా ఒక కామెడీ సీన్ ఇచ్చింది.
ఆ సీన్లనే నేను కథలుగా మలిచాను.

కొన్ని సందర్భాల్లో నేను హీరోను, కొన్ని సందర్భాల్లో బాధితుణ్ని, మరికొన్ని సందర్భాల్లో నవ్వుల పాలైన వాడినే! ఈ కథలు చదివేటప్పుడు "అయ్యో! ఇదే మా జీవితంలో కూడా జరిగింది!"
అని మీరు అనుకుంటే ఆశ్చర్యపడకండి.
ఎందుకంటే మనందరి జీవితాల్లోనూ చిన్న చిన్న కామెడీ నాటకాలు నడుస్తూనే ఉంటాయి.
నవ్వించడమే నా ఉద్దేశం కాదు;
జీవితం అంత సీరియస్ కాదని గుర్తు చేయడమే నా ప్రయత్నం.

చదివాక మీరు హృదయపూర్వకంగా నవ్వితే, మధ్య మధ్యలో "అయ్యో పాపం!" అనిపిస్తే, అదే ఈ పుస్తకానికి నిజమైన విజయంగా భావిస్తాను.

నవ్వుల్లో దాగి ఉన్న నా జీవితం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. నా జీవితంలోని చిన్న చిన్న కామెడీ ఎపిసోడ్లు

మీ ముఖంలో పెద్ద చిరునవ్వు తెస్తాయని ఆశిస్తున్నాను.
నవ్వుతూ చదవండి !
చదువుతూ మళ్లీ నవ్వండి!

- మేదరమెట్ల చక్రధర్ నాయుడు

You may also like