Skip to product information
With Your Permission by [ Gitanjali Dr. Bharathi]
Rs. 250.00
మూసుకున్న తలుపుల వెనకాల పెళ్లి, సంసారం, దాంపత్యం, పరువు, శృంగారం, తాళి పేరుతో నిత్యము స్త్రీల మీద భర్తలు చేసే లైంగిక అత్యాచారాలను ,భార్యలు,పితృస్వామ్య సమాజమూ,పురుషుల సహజమైన కో రికలుగా చూడకుండా మారిటల్ రేప్ గా గుర్తించి శిక్షించాలని ఈ నవల డిమాండ్ చేస్తున్నది. లైంగిక హింస కూడా గృహహింస లో భాగంగా చూస్తూ భార్యలు కేసు ఫైల్ చేసి భర్తలను శిక్షించవచ్చు అని చెబుతున్నది ఈ నవల.
నొప్పి,బాధ,అవమానం,ఆధిపత్యం లేని శృంగారాన్ని అనుభవించే లైంగిక హక్కు మానవ హక్కుల్లో భాగంగా స్త్రీలకి ఉంది. దాన్ని పురుషులు గుర్తించి,గౌరవించాలి అని చెబుతుంది ఈ నవల. మారిటల్ రేప్ మీద భారతీయ సాహిత్యంలో,తెలుగులో గీతాంజలి రాసిన తొట్ట తొలి నవల ఇది.